ఒక దివ్వె ఉంటే వస్తువులను చూడడాని కుపయోగ పడుతుంది. కాని చూడడానికి కన్నులు లేకుంటే దివ్వెతో ఏమిపని? అంతా చీకటే. కన్నులున్నప్పటికీ మనము లేకపోతే ఆ కన్నులు చూడలేవు. మైకం వచ్చి కిందపడితే కన్నులు తెరచికొనియే ఉన్నా చూపు మాత్రం ఉండదు. అలాగే మనసు మాత్రం ఉండదు. అలాగే మనసు మాత్రం వున్నా చాలదు. ఆ మనసులో ఆత్మజ్యోతి అణగి ఉండాలి. ఆత్మజ్యోతిః ప్రసారము ఉన్నంత వరకే మనస్సు తలచినా కన్నులుచూచినా దివ్వెవెలుగున వస్తువులచే కనుగొన్నా దివ్వె వెలుగులో జడవస్తువులు కనబడతై. వీని కన్నిటికి మూలం ఆత్మజ్యోతి. ఆ ఆత్మజ్యోతియే చైతన్యం. చైతన్యం ఒక్కటంటే ఒక్కటే.
- శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతీ శంకరాచార్యస్వామి. |